- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పత్రికలకు ‘దిశ’ ఆదర్శం
దిశ, తిరుమల: డైనమిక్ రూపంలో ఎప్పటి కప్పుడు నిఖార్సైన తాజా వార్తలను అందిస్తున్న ‘దిశ’ డిజిటల్ పత్రిక ఆదర్శంగా నిలిచిందని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. భోగి సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు సైకం జయచంద్రా రెడ్డితో కలిసి ‘దిశ’ 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిషరించారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్, సైకం జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ పత్రికలు వార్తల విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో తాజా వార్తలను అందిస్తున్న ‘దిశ’ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. డిజిటల్ మీడియాలో ఇప్పటికే దిశ ప్రభంజనం సృష్టించిందని కొనియాడారు. భవిష్యత్తులో ప్రధాన పోటీ పత్రికలు సైతం డిజిటల్‌ను ఫాలో అయినా.. ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. ఇప్పటికే ఏ రోజుకు ఆ రోజు తాజా వార్తలు డైనమిక్ ఎడిషన్ పేరుతో పాఠకులకు వేగంగా వార్తలను అందిస్తున్న ‘దిశ’ యాజమాన్యం మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అదే సమయంలో పత్రికలు ఏవైనా, ఒకే రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా అన్ని పార్టీలకు సమానంగా పత్రికలలో స్థానం కల్పించాలని విన్నవించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ‘దిశ’ తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లాల బ్యూరో ఇంచార్జ్ చంద్రశేఖర్, తిరుమల ప్రతినిధి ఎం శివశంకర్ పాల్గొన్నారు.