- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతిలో దొంగ ఓట్లపై జనసేన దండయాత్ర
దిశ, తిరుపతి: తిరుపతిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని, తక్షణమే వాటిని తొలగించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో 40 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 22న విడుదల చేయనున్న ఓటర్ల తుది జాబితాను వాయిదా వేయాలని కోరారు. దొంగ ఓట్లకు తిరుపతి నిలయంగా మారిందని ఆరోపించారు. కొందరు రాజకీయ నాయకుల మాటలు విని గతంలో దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన కొందరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు ఏ రాజకీయ పార్టీకీ కొమ్ము కాయకుండా నిస్వార్ధంగా పని చేయాలని సూచించారు. ఓటర్ జాబితాను పున పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఎక్కడైనా ఒక్క దొంగ ఓటు ఉందని తెలిసినా జనసేన పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు.