Tirumala: పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

by srinivas |
Tirumala: పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలకు భక్తుల పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో తిరుమల కొండకు రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్‌లో వేచివున్నారు. మరోవైపు హుండీ కానుకులు కూడా భారీగా వస్తున్నాయి. సోమవారం ఒక్క రోజు రూ. 4.32 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. 70,366 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement

Next Story