AP Politics:చంద్రగిరి కోట పై టీడీపీ జెండా ఎగరేయడం ఖాయం : టీడీపీ నేత

by Jakkula Mamatha |   ( Updated:2024-05-01 14:43:13.0  )
AP Politics:చంద్రగిరి కోట పై టీడీపీ జెండా ఎగరేయడం ఖాయం : టీడీపీ నేత
X

దిశ,తిరుపతి రూరల్: చంద్రగిరి కోట పై టీడీపీ జెండా ఎగరేయడం ఖాయం అని టీడీపీ నేత డాలర్స్ దివాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని విజయం కోసం బుధవారం డాలర్స్ దివాకర్ రెడ్డి తనపల్లి , కుంట్రపాకం పంచాయతీలలో విస్తృత ప్రచారం చేశారు. ఆయనకు ఉమ్మడి కూటమి నాయకులు, దివాకర్ రెడ్డి అభిమానులు, స్థానిక ప్రజలు కలిసి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. దివాకర్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ ,సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తనపల్లిలో..బాల చంద్రా రెడ్డి, సందీప్ రెడ్డి, మన్మధ రెడ్డి, దయాకర్, లోకనాథ్ రెడ్డి, కుంట్రపాకంలో రామ మూర్తి, చెంచు రెడ్డి, ముని కృష్ణ యాదవ్, నాగరాజు, కుమార్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ,జనసేన,బీజేపీ ,నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Read More...

AP Politics:కార్మికలోకం పొట్ట కొట్టిన జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన: జీవీ ఆంజనేయులు

Advertisement

Next Story