- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Lokesh: అన్నమయ్య డ్యాం గుర్తులేదా జగన్!
దిశ, తిరుపతి: అసమర్థ, పాలనా అనుభవం లేని ముఖ్యమంత్రితో సమస్యలు ఎదురవుతున్నాయని సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. చంద్రగిరి నియోజకవర్గం తనపల్లిలో వరదలకు కొట్టుకపోయిన కాజ్‌వేని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్వర్ణముఖి నదిపై నిర్మించిన కాజ్‌వేలు 2021లో వచ్చిన వరదలతో కోతకు గురయ్యాయని నారా లోకేశ్‌కు స్ధానికులు తెలిపారు. రెండేళ్లు గడుస్తున్నా వాటిని నిర్మించలేదని లోకేశ్‌కు వివరించారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ నీటి నిర్వహణలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందువల్ల ప్రజలు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తోందని ఆరోపించారు. వర్షాకాలంలో కనీస అంచనాలు లేకుండా జగన్ ప్యాలస్‌లో పడుకోవడం వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 60 మందిని పొట్టన పెట్టుకున్నాడని ఆరోపించారు. కాజ్‌వేలు కొట్టుకుపోయి ఏడాది అవుతున్నా... ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.