Chittoor: తారకరత్న కోసం ప్రత్యేక పూజలు

by srinivas |   ( Updated:2023-01-28 11:05:03.0  )
Chittoor: తారకరత్న కోసం ప్రత్యేక పూజలు
X

దిశ, చిత్తూరు: నటుడు తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానంలో తెలుగు మహిళా అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష ప్రత్యేక పూజలు నిర్వహించారు. తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నారు. అలాగే లోకేశ్ పాదయాత్ర కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

కాగా తారకరత్న ఆరోగ్య ప్రస్తుత పరిస్థితిపై నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని తెలిపింది. తారకరత్న ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్, వాసోయాక్టివ్ సపోర్ట్‌పై బెలూన్ యాంజియోప్లాస్టీతో యాంటీరియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. జనవరి 28న అర్థరాత్రి 1 గంటలకు ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని తెలిపారు. తారకరత్నకు ప్రామాణిక మార్గదర్శకాలు, ప్రోటోకాల్‌ ప్రకారం చికిత్స కొనసాగుతుందని హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తారకరత్న కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లు, ఇతర నిపుణుల సంరక్షణలో చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తారకరత్నను కాపాడేందుకు వైద్యులు సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed