Kuppam Tention: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం

by srinivas |   ( Updated:2023-01-04 12:12:57.0  )
Kuppam Tention: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబును పోలీసులు కుప్పంలో అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కందుకూరు, గుంటూరు ఘటనతో సభలు, రోడ్ షోలు, ర్యాలీపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మేరకు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబు నుంచి సమాధానం లేకపోవడంతో కుప్పం పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా సరే చంద్రబాబు కుప్పంలో పర్యటించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. అటు టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ అధినేత పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని ఆందోళనకు దిగారు. కుప్పం అడ్డ.. చంద్రబాబు అడ్డాఅని కార్యకర్తలు నినాదాలు చేశారు.

Read more:

Police Vs Tdp కార్యకర్తలు...Kuppam లో క్షణం.. క్షణం

Kuppam Incident: సీఎం జనగ్ పై నారా లోకేశ్ తీవ్ర ఆగహం

Advertisement

Next Story