తారకరత్న కోలుకుంటున్నారు: Balakrishna

by srinivas |   ( Updated:2023-01-27 11:13:42.0  )
తారకరత్న కోలుకుంటున్నారు: Balakrishna
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు నందమూరి తారకరత్న కోలుకుంటున్నారని హిందూపురం ఎమ్మెల్యే, ఆయన బాబాయ్ బాలకృష్ణ తెలిపారు. నారా లోకేశ్ పాదయాత్రలో సొమ్మసిల్లిపడిపోయిన తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ స్పందించారు. తారకరత్నకు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారని, అభిమానులు ఆందోళన చెందొద్దని సూచించారు. తారకరత్న గుండెల్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నాయని తెలిపారు. గుండె కుడి, ఎడమ రక్తనాళాలు బ్లాక్ అయ్యాయని తారకరత్న బీపీ నార్మల్‌గా ఉందని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తున్నామని, అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన్ను అక్కడి నుంచి పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. తాజాగా బెంగళూరుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: తారకరత్నకు హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం అదే: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై Junior NTR ఆవేదన

Advertisement

Next Story