- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Chandrababu: నా నియోజకవర్గానికి నేను వెళ్లకూడదా?
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. సీఎం జగన్ చీకటి జీవోతో తమ సభలను అడ్డుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కుప్పం పర్యటనపై గత నెలలోనే డీజీపీకి లేఖ రాశారని చెప్పారు. తన సభలను అడ్డుకునేందుకే సీఎం జగన్ చీకటి జీవో తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసుల దయాదాక్షిణ్యాలతో అనుమతి తీసుకోవాలని జీవో తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి సీఎం సభ పెడితే ఏం చేశారని, ఆ సభలకు పెద్ద వాళ్లను, అడవాళ్లను తీసుకొచ్చారని గుర్తు చేశారు. కుప్పం నుంచి 7సార్లు గెలిచిన తనను అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని, తన సొంత ఇంటికి తాను వెళ్లకూడదా అని ప్రశ్నించారు. తన సభలకు వస్తున్న జనాన్ని చూసి జగన్‌కు వణుకు పుట్టిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. అందుకే తమ సభలను అడ్డుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :
1.Kuppam Tention: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం