Chennai Express: అర్ధరాత్రి చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల హల్‌చల్.. బంగారం లాక్కొని పరార్

by Shiva |
Chennai Express: అర్ధరాత్రి చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల హల్‌చల్.. బంగారం లాక్కొని పరార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య దోపిడీ దొంగలు ప్యాసింజర్ రైళ్లలో వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ.. రైల్వే పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోకి దొంగలు చొరబడ్డారు. ఏకంగా ట్రైన్ చైన్ లాగి S6, S7 స్లీపర్ కోచ్‌లలో బీభత్సం సృష్టించారు. నిద్రిస్తున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలో ఉన్న బంగారం లాక్కొని అక్కడి నంచి ఉడాయించారు. ఈ క్రమంలో బోగీలో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమయ్యే లోపు దొంగలు కంటికి కనిపించకుండా తప్పించుకున్నారు. అదేవిధంగా నడికుడి రైల్వే స్టేషన్ వద్ద నరసాపూర్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. దీంతో బాధిత ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story