టీడీపీలో ‘చీపురు’ పంచాయితీ! గందరగోళంలో పార్టీ శ్రేణులు

by Ramesh N |   ( Updated:2024-03-02 15:30:26.0  )
టీడీపీలో ‘చీపురు’ పంచాయితీ! గందరగోళంలో పార్టీ శ్రేణులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ ఆశించిన పలు నియోజకవర్గల నేతలు పార్టీల జంపింగ్‌లు నడుస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ-జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన నాటి నుంచి అసంతృప్తి నేతలు పలు సెగ్మెంట్లలో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన అభ్యర్థులపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే చీపురుపల్లి సెగ్మెంట్‌ టీడీపీ రాజకీయాలు చర్చనీయంశంగా మారింది.

పోటీ నుంచి తప్పుకున్నది వీరే

చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఆయనకు చెక్ పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు‌ను బరిలో దించాలని భావించారు. కానీ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనని గంటా శ్రీనివాసరావు స్పష్టంచేశారు. తాను భీమిలి నుంచి పోటీకి ఆసక్తి ఉన్నట్లు మనసులో మాట చెప్పారు. మరోవైపు చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు బరిలో దించాలని, ఆయనను అధిష్టానం కోరింది. కానీ ఆయన కూడా చీపురుపల్లి నుంచి పోటీ చేయనని తప్పుకున్నారు. దీంతో చీపురుపల్లి నియోజకవర్గం అభ్యర్థుల ట్వీస్ట్‌లు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే అధిష్టానం మరోపేరును తెరపైకి తీసుకువచ్చింది.

అజ్ఞాతం వీడిన నేత

ప్రస్తుతం మీసాల గీత పేరు టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. కానీ దీనిపై ఆమె ఇంకా స్పందించలేదు. మరోవైపు చీపురుపల్లిలో టికెట్ ఆశిస్తున్న నేతలు పలువురు ఉన్నారు. మొదట గంటా పేరును సూచించడంతో పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కిమిడి నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్లారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే గంటా పోటీ చేయనని తప్పుకోవడంతో కిమిడి నాగార్జున అజ్ఞాతం వీడి టికెట్ కోసం ప్రయాత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు ఆ నియోజకవర్గంలో గందరగోళానికి గురవుతున్నారు. టీడీపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థిపై త్వరగా క్లారిటీ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.

Read More..

ఏపీ రాజకీయాల్లో కీలక ట్విస్ట్.. పవన్ పై పోటీకి సిద్ధమైన కాపు నేత..!

Advertisement

Next Story