- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఐడీ పంజా.. దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో తనిఖీలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలి నానక్ రామ్ గూడలోని వాసుదేవరెడ్డి ఇంట్లో ఉదయం నుంచి సీఐడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ సీఎం జగన్ హయాంలో వైసీపీకి లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయనపై ఫిర్యాదులున్న విషయం తెలిసిందే. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జే-బ్రాండ్ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది ముఖ్యపాత్ర అని, డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో ఈయన కీలకపాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. మద్యం రేట్లను పెంచడం, ఊరు పేరు లేని మద్యం బ్రాండ్లను విక్రయించడంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఐదేళ్లుగా విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇక రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం వాసుదేవరెడ్డిని బేవరేజెస్ కార్పొరేషన్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.