- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap Politics: పాలకొల్లులో చంద్రబాబు బస వద్ద ఉండి కార్యకర్తల ఆందోళన
దిశ, ఏలూరు: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసెంబ్లీ టికెట్ల కేటాయింపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా మారింది. టికెట్ ఆశించిన నేతలు భంగపడ్డారు. తమ కు ఈ పరిస్థితి ఎదురు కావడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఇప్పటికే ప్రకటించారు. గత రెండు రోజులుగా చంద్రబాబు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ప్రజాగళం పేరిట యాత్ర చేపట్టారు. శుక్రవారం నల్లజర్ల లో గోపాలపురం, పోలవరం టీడీపీ నేతలు చంద్రబాబు కాన్వాయ్ ఆపి అభ్యర్థుల మార్పు కోసం పట్టుబట్టారు. వారికి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలకొల్లు పర్యటనకు వెళ్లారు.
నరసాపురం ఎంపీ కనుమూరి రాఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరారు. దీంతో ఇప్పటికే ఉండి స్థానం నుంచి రఘురామ పోటీ తప్పదని వార్తలు ఇటు పత్రికల్లో అటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మంతెన రామరాజు అనుయాయుడు పాలకొల్లు లో చంద్రబాబు బసచేసిన చోటుకు వెళ్లి ఉండి అభ్యర్థిగా రామరాజునే కొనసాగించాలని నినాదాలు చేశారు. “వుయ్ వాంట్ జస్టిస్.. మాకు న్యాయం చేయండి” అనే నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామ కృష్ఱం రాజు టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. రామరాజు టికెట్ ని కాస్తా రఘురామకృష్ణంరాజుకు కట్టబెడుతున్నట్టు ప్రకటించడంతో ఎమ్మెల్యే వర్గం ఆందోళనకు దిగింది.
దీనిపైన స్పందించిన ఎమ్మెల్యే రామరాజు కొన్ని ఛానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని పత్రికలు. ఛానళ్ళలోనూ, సోషల్ మీడియా లో ఉండి సీటు తనకు కాకుండా వేరొకరికి అనే వార్త తెలుసుకుని కార్యకర్తలు ఆందోళన చెందారన్నారు. వారి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కార్యకర్తల అభిప్రాయాలు గౌరవించాలి. అలాగే పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి.. కానీ కార్యకర్తల మనోభావాలను దెబ్బ తినకుండా చూడాలి కదాటికెట్ వేరొకరికి అంటే నాకూ బాధ గానే వుంటుంది కదా అని అన్నారు. రఘురామరాజు కోసం తనని బలిచేయడం కరెక్ట్ కాదంటున్నారాయన. చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ వద్ద ఉండి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు ఎంత నినాదాలు చేసి ఆందోళన చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు.