Chandrababu Naidu arrest: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

by Seetharam |   ( Updated:2023-09-14 06:28:45.0  )
Chandrababu Naidu arrest: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేసింది. ఇకపోతే అంగల్లు అల్లర్ల ఘటనలో ఏ-1 నిందితుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు గురువారం లిస్ట్ అయింది. ఇందులో భాగంగా హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

Advertisement

Next Story