‘రైతులను రెచ్చగొట్టాలని చూసి చంద్రబాబు అభాసుపాలయ్యాడు’

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-06 08:16:48.0  )
‘రైతులను రెచ్చగొట్టాలని చూసి చంద్రబాబు అభాసుపాలయ్యాడు’
X

దిశ, డైనమిక్ బ్యూరో : అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతీ గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మాజీసీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు రైతులను రెచ్చగొట్టాలని ప్రయత్నించి అభాసుపాలయ్యారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై మంత్రి కాకాణి సెంటైర్లు వేశారు. మిల్లర్లతో కొమ్మక్కై కోట్లు దోచుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అని విమర్శించారు. వ్యవసాయ శాఖకు, పౌర సరఫరా శాఖకు మధ్య వ్యత్యాసం కూడా సోమిరెడ్డికి తెలియదు.... మంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో కూడా తల దూర్చి కోట్లు నొక్కాడు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Read More: ‘దర్యాప్తు జరుగుతోంది.. చంద్రబాబు అరెస్ట్‌ను ఎవరూ ఆపలేరు’

Advertisement

Next Story