చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటన రద్దు

by M.Rajitha |
చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటన రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదివారం జరగాల్సిన తన హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్నారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్ళల్లోకి నీళ్ళు చేరి వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఏపీలో ఉత్పన్నమైన సమస్యల కారణంగా నేడు హైదరాబాద్ లో జరుగుతున్న బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాని చంద్రబాబు మీడియాకు తెలిపారు. ఈ మేరకు బాలకృష్ణతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపి, రాలేకపోతున్న కారణాన్ని వివరించారు. కాగా విజయవాడలోని కలెక్టరేట్ ఆఫీసును తాత్కాలిక సీఎం ఆఫీసుగా మార్చి వరద ప్రాంతాల సహాయక చర్యలను సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ఈ రోజు సీఎం తన ప్రత్యేక బస్సులోనే ఉండనున్నారని సమాచారం.

Next Story

Most Viewed