- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహానాడు ఎఫెక్ట్: చంద్రబాబు మరో వ్యూహం.. వారికి గుండెల్లో రైళ్లు!!
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ శ్రేణులకు అత్యంత ఇష్టమైన ఉత్సవం మహానాడు. నట విఖ్యాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నిర్వహించే ప్రతిష్టాత్మక వేడుక మహానాడు. ప్రతి ఏటా రెండు లేదా మూడు రోజులపాటు టీడీపీ ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా ఒంగోలులో రెండు రోజులపాటు (మే 27, 28) జరిగిన ఈ కార్యక్రమం అనుకున్నదానికంటే గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. మహానాడు ఈవెంట్ సిట్టింగ్ ఎరేంజ్మెంట్స్ నుండి ఫుడ్ వరకు ఏ లోటూ లేకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తారని గుర్తింపు ఉంది. అయితే ఈసారి అంచనాలకు మించి భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు హాజరు కావడంతో.. వారిని ఆర్గనైజ్ చేయడం ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 5 లక్షల మందికి పైనే కార్యక్రమానికి హాజరైనట్టు అంచనా వేస్తున్నారు.
ఇక ఇదే జోష్ లో మరో ప్రణాళికతో జనంలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు మహానాడు వేదికపైనే కీలక ప్రకటన కూడా చేశారు. మినీ మహానాడులు నిర్వహించాలని అధిష్టానం ఫిక్స్ అయింది. పార్లమెంటుల ప్రాతిపదికన 3 రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. యువనాయకులకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామాల్లోని బూత్ స్థాయి నుండి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం వరకూ అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని టీడీపీ హైకమాండ్ ఆలోచిస్తోంది. పార్టీ, అనుబంధ సంఘాల పదవుల్లో ఉన్నవారు, పార్టీ క్రియాశీలక, సాధారణ సభ్యులతో కలిపి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 50 వేల నుండి 60 వేల మంది వరకు ఉండొచ్చని పార్టీ అంచనా వేస్తోంది.
ఇక వీరందరితో కలిపి 3 రోజుల పాటు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మినీ మహానాడులు నిర్వహించి పార్టీ బలోపేతానికై పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. స్థానిక నేతల మధ్య విబేధాలను చక్కబెట్టటం, ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు దిశా నిర్దేశం, పంచాయితీల సర్దుబాటు, పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా యువ నాయకులను ప్రోత్సహించడం వంటివి మినీ మహానాడులోని ముఖ్య ఎజెండా అయినట్టు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు, స్థానిక సమస్యలను ఎత్తి చూపడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. ఇక ఇదే సమయంలో పార్టీకి గడ్డుగా మారిన నేతలపై దృష్టి సారించి, అవసరమైతే వారిని పక్కన పెట్టే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నారని పార్టీ ఇన్సైడ్ టాక్. దీంతో మేము సీనియర్లం, టికెట్ మాకే అంటూ ధీమాగా ఉన్న నేతలకు సైతం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.