వైసీపీ మేనిఫెస్టోపై చంద్రబాబు రియాక్షన్ ఇదే..!

by srinivas |   ( Updated:2024-04-27 14:02:29.0  )
వైసీపీ మేనిఫెస్టోపై చంద్రబాబు రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో పలు కీలక అంశాలు చేర్చారు. గతంలో మాదిరిగా నవరత్నాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే గత నవరత్నాల్లో నుంచి రెండు హామీలను తొలగించారు. ఈసారి ఆ హామీలను ప్రస్తావించకుండా వేరే అంశాలు చేర్చి మేనిఫెస్టోను విడుదల చేశారు. తనకు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పారు. ఇప్పుడు ఇలా చెప్పడంపైనే విమర్శలు వెల్లువెతున్నాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలని అంశాలను ప్రస్తావిస్తూ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు?

‘‘మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే... 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్నావ్ నువ్వు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావు?. జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చిన 730 హామీలలో ఇవి కొన్ని. గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా జగన్ నెరవేర్చలేదు. ఆ మాటకొస్తే 85 శాతం హామీలను జగన్ నెరవేర్చలేదు. ఈరోజు మళ్ళీ ఇంకో మేనిఫెస్టోతో జనాన్ని మోసం చేయడానికి వచ్చాడు. మళ్ళీ ఇంకోసారి మోసపోడానికి మీరు సిద్ధమా అని అడుగుతాడు. నిన్నుఇంటికి పంపడానికి సిద్ధం అని మీరు కూడా గట్టిగా చెప్పండి.’’ అని చంద్రబాబు పిలుపు నిచ్చారు.

Advertisement

Next Story