- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ దేశాలు సైతం భారత్ వృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నాయి: కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఇద్దరూ అద్భుతమైన నేతలని, అహర్నిశలు శ్రమించే తత్వం ఉన్న నాయకులని కొనియాడారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురించి మాట్లాడుతూ.. ఆయన ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేస్తుంటారని, ఆయన యువతతో పోటీపడి చంద్రబాబు పనిచేస్తుంటారని, సాంకేతికత వినయోగంపై చర్చలు జరుపుతుంటారని అన్నారు.
అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ.. దేశాభివద్ధి కోసం అనునిత్యం ఆలోచించే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. ప్రస్తుతం భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని, ప్రపంచ దేశాలు సైతం భారత్ వృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నాయని రామ్మోహన్ నాయుడు అన్నారు. గత పదేళ్లలో దేశంలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 157కు పెరిగిందని, విమానాల్లో ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందని, భవిష్యత్తుల్లో విమానయాన శాఖను మరింత వృద్ధి సాధించేలా చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు.