- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chadrababuకు కేంద్రం ఆహ్వానం.. డిసెంబర్ 5న ఢిల్లీకి..!
దిశ, డైనమిక్ బ్యూరో:తెలుగుదేశం పార్టీ (Tdp) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు కేంద్రం ఢిల్లీకి రావాలని ఆహ్వానం పంపింది. డిసెంబర్ 5న ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొనాలని కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Union Parliamentary Affairs Minister Prahlad Joshi) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. కేంద్రం ఆహ్వానంతో చంద్రబాబు డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్లనున్నారు.
కాగా జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సు (G-20 Conference of Partner Countries)కు ఢిల్లీ వేదిక కానుంది. ఈ సదస్సు 2023లో జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖ రాజకీయ వేత్తలతో భేటీ కావాలని ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi) నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 5న సాయంత్రం 5గంటలకు రాష్ట్రపతి భవన్‌లో వివిధ పార్టీల నేతలు, ప్రముఖ రాజకీయ వేత్తలతో మోడీ భేటీ కానున్నారు. ఈ సమావేశం ద్వారా రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోనుంది. జీ20 శిఖరాగ్ర సమావేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ని ప్రత్యేక ఆహ్వానితునిగా కేంద్రం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ జీ-20 శిఖరాగ్రసదస్సు ముఖ్య ఉద్దేశం... దేశంపాత్ర వంటి అంశాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కేంద్రపార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివరించారు.
- Tags
- Andhra Pradesh