Vivekha Murder Case: అవినాష్‌రెడ్డిని ప్రశ్నిస్తోన్న సీబీఐ అధికారులు

by srinivas |   ( Updated:2023-01-28 11:39:01.0  )
Vivekha Murder Case: అవినాష్‌రెడ్డిని ప్రశ్నిస్తోన్న సీబీఐ అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకానందారెడ్డి హత్య కేసులో ఆయనకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాయంలో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అవినాశ్ రెడ్డికి అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే అవినాశ్ రెడ్డి తరపున వచ్చిన న్యాయవాదులను సీబీఐ కార్యాలయంలోకి అనుమతించలేదు. మరోవైపు సీబీఐ కార్యాలయం వద్ద అవినాశ్ రెడ్డి అనుచరులు భారీగా చేరుకున్నారు. అవినాశ్ రెడ్డి ఎప్పుడు భయటకు వస్తారా? అని ఎదురు చూస్తున్నారు.

అయితే అవినాశ్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు వైఎస్ విజయమ్మతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోటస్‌ పాండ్‌‌లో విజయమ్మతో ఎంపీ అవినాశ్ రెడ్డి భేటీ అయ్యారు. విజయమ్మతో దాదాపు 15 నిమిషాల పాటు అవినాశ్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం అవినాశ్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా వివేకా హత్యకేసులో వాస్తవాలను వెలికి తీయాలని వైఎస్ఆర్టీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ఆయన ఇంటిలో అత్యంత క్రూరంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలపెట్టొద్దని ఇటీవలే షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ విజయమ్మ కుమార్తె షర్మిలతోనే ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో వైఎస్ విజయమ్మను అవినాశ్ రెడ్డి కలవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి: వివేకను చంపింది ఎవరో తేలిపోయింది.. Ycp Mla Srikanth Reddy సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed