- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: టీడీపీపై కుట్రచేసే గెలిచాం.. వైసీపీ ఆడియో క్లిప్ వైరల్
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ పార్టీలన్నీ విజయభేరిని మోగించి పార్టీ జెండాను రెపరెపలాడించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న సమయంల్లో.. గత పంచాయితీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే గెలిచాం అని వైసీపీ ఎమ్మెల్సీనే బయటపెట్టిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనితో తాను కింజరాపు అప్పన్నతో నామినేషన్ వేయించాను.. ఆ తరువాత అదే అదునుగా అచ్చెన్నాయుడు స్వగ్రామంపై దాడి చేసాను. తిరిగి నా పై దాడి చేసినట్లు క్రియేట్ చేసి అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టించాను. ఆ తరువాత సంతబొమ్మాళి జెడ్పీటీసి అభ్యర్దిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించాను.
కోట బొమ్మాళి, నందిగామ అభ్యర్థులను బెదిరించి బయటకు రాకుండా చేసాను. అలానే టీడీపీ క్యాడర్ ను బెదిరించి నాలుగు ఎంపీటీసీలు, నాలుగు జడ్పిటీసీలు 119 పంచాయితీలను కైవసం చేసుకున్నాం. రిగ్గింగ్ చేసే వాడే పోటీ చెయ్యాలని కార్యకర్తలకు వైసీపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సూచించినట్లు ఓ ఆడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.