- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. ఫిబ్రవరి 1న నుంచి ఇక పండగే
దిశ, వెబ్‌న్యూస్ : ఫిబ్రవరి 1న ఇచ్చే వేతనంతో పాటుగానే ఉద్యోగలకు నైట్ హాల్ట్ అలవెన్స్ ఇచ్చేదుకు ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలతో సహా ఉద్యోగులకు ఫిబ్రవరి 1న అందేలా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమం, డిమాండ్లను పరిష్కరించనున్నట్లు సర్కార్ హామీ ఇచ్చింది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైమ్ అలవెన్స్‌లను ఉద్యోగులకు సంస్థ ఇప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తుంది. 2017నాటి పే రివిజన్ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్‌కు చెల్లించాల్సిన మొత్తాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఇటీవలే వాటన్నింటినీ క్లియర్ చేయాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. తాజాగా నైట్ హాల్ట్ అలవెన్సులను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఫిబ్రవరి 1న అందే వేతనంలో నైట్ హాల్ట్ అలవెన్సులను కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.