- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అవినాష్‌రెడ్డికి లభించిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్‌పై ఇవాళ మరోసారి సుప్రీం కోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. కేసు డైరీ మొత్తం కోర్టు ముందు ఉంచాలని సీబీఐని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ మూడో వారంలో వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో కేసు డైరీ 60 భాగాలుగా ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వివరాలు అన్నింటినీ డిజిటల్ రూపంలోకి మార్చి అందజేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.
Read More..
Breaking: గుడివాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్