BREAKING: నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం అంతే ఉంది: ఏఏజీ పొన్నవోలు సుధాకర్

by Shiva |   ( Updated:2024-04-26 11:32:13.0  )
BREAKING: నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం అంతే ఉంది: ఏఏజీ పొన్నవోలు సుధాకర్
X

దిశ, వెబ్‌డెస్క్: నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం కూడా అంతే ఉందని ఏఏవో పొన్నవోలు సుధాకర్ అన్నారు. ఇటీవల ఓ సభలో వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్యయంగా తన అన్న వైఎస్ జగనే అని వైఎస్ షర్మిల వెల్లడించారు. తన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా వైఎస్సార్ పేరును ఛార్జిషీట్‌లో జగన్ చేర్చించారని ఆమె ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు పొన్నవోలు సుధాకర్ ప్రెస్‌మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక అడ్వకేట్‌గా తన మనసు చెలించి అన్యాయాన్ని అరికట్టేందుకు మీడియా ముందుకు వచ్చానని తెలిపారు.

వైఎస్ షర్మిల తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఫైర్ అయ్యారు. జగన్‌పై అక్రమాస్తుల కేసు నమోదైనప్పుడు అప్పటికి ఆయన ఎవరో తనకు తెలియదని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే షర్మిల పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. అన్యాయంగా మహోన్నత నాయకుడు వైఎస్ఆర్‌ను మలినం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాస్తుల విషయంలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు లెటర్ రాశారని తెలిపారు. ఏ తప్పూ చేయని రాజశేఖర్ రెడ్డి మీద 2011లోనే ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఆగస్ట్ 17, 2011న వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారని పేర్కొన్నారు.

Advertisement

Next Story