- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రాష్ట్ర పోలీసు శాఖలో సంచలనం.. మూకుమ్మడిగా సిబ్బందిపై ఈసీ బదిలీ వేటు
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెంటనే ఢిల్లీకి రావాలని సీఈసీ ఆదేశించగా వారు సీఈసీ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో పూర్తిగా విఫలయ్యరని వారిపై మండిపడింది. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా వారు పోలింగ్ తరవాత జరిగిన ఘటనలపై పూర్తి నివేదిక అందజేశారు. ఈ మేరకు సీఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా భారీగా అధికారులపై సీఈసీ సస్పెన్షన్ వేటు వేసింది.
అందులో పల్నాడు కలెక్టర్ శివశంకర్ బదిలీ వేటుతో పాటు, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా పల్నాడు ఎస్పీ బిందుమాధవ్‌పై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. అనంతరం ఎస్పీ అమిత్ సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన చర్యలు, తిరుపతి ఎస్పీ మణికంఠపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన చర్యలు, అదేవిధగా ఐదుగురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలతో పాటు ఇద్దరు ఎస్సైలను కూడా సీఈసీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇంత పెద్ద ఎత్తున అధికారులు బదిలీ అవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.