- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్ : చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ స్కామ్ వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఏపీ సీఎం జగన్ తొలిసారి స్పందించారు. చంద్రబాబులా తాను ఎవరిని మోసం చేయలేదన్నారు. చంద్రబాబు అడ్డంగా నిలువునా దొరికపోయారన్నారు. ఆడియో, వీడియో టేపులతో దొరికినా బుకాయిస్తున్నారన్నారు. చంద్రబాబును కాపాడటానికి కొంత మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చట్టం ఎవరికైనా ఒక్కటే అన్నారు. ఎన్ని మోసాలు, దొంగతనాలు, వెన్నుపోట్లు పొడిచినా.. చంద్రబాబును పలుకుబడి కలిగిన ముఠా కాపాడిందన్నారు.
స్కిల్ స్కాం సూత్ర ధారి, పాత్రధారి చంద్రబాబే అని సీఐడీ నిర్ధారించిందన్నారు. డబ్బును డొల్ల కంపెనీలకు ఎలా మళ్లించారన్నది ఈడీనే బయటపెట్టిందన్నారు. చంద్రబాబు పీఏ చాటింగ్ లను ఐటీ శాఖ బయటపెట్టిందన్నారు. ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిందన్నారు. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాతే కోర్టు బాబును రిమాండ్‌కు పంపిదన్నారు. ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా అని చంద్రబాబు అంటున్నారన్నారు. నిస్సిగ్గుగా కొంత మంది చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారన్నారు.
రూ.371 కోట్ల జనం సొమ్ము ఎక్కడికి పోయిందన్నారు. చంద్రబాబు నడిపిన కథలో ఆయన్ని కాకుండా ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలన్నారు. ములాఖత్‌లో మిలాఖత్ అయి పొత్తు పెట్టుకునేది ఒకరు అంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై జగన్ మండిపడ్డారు. ములాఖత్‌లో మిలాఖత్ అయ్యే వాళ్లను ఏం చేయాలి అన్నారు. జీవితమంతా సామాజిక వర్గాలను చంద్రబాబు వంచించారన్నారు. ప్రశ్నిస్తానని చెప్పి అవినీతిలో పాలు పంచుకున్న ఈ వ్యక్తిని ఏమనాలని పవన్‌ను ఉద్దేశించి జగన్ సీరియస్ అయ్యారు.