BREAKING: ఏపీలో పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. వల్లభనేని వంశీపై కేసు నమోదు, అరెస్టుకు రంగం సిద్ధం

by Shiva |
BREAKING: ఏపీలో పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. వల్లభనేని వంశీపై కేసు నమోదు, అరెస్టుకు రంగం సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రభుత్వం మారడంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయలపై విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే వాళ్లపై టీడీపీ నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. అదే విషయాన్ని తమ తరఫు న్యాయవాది నుంచి కోర్టుకు విన్నవించారు.

ఈ పరిణామంతో అరెస్టుల ఖాయమని వైసీపీ నాయకులంతా ఎక్కడికక్కడ పరార్ అయ్యారు. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి చేసిన వారిలో కొందరని మాత్రమే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్‌ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఏ క్షణంలో అయినా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed