బాత్ రూంలో సీక్రెట్ కెమెరాల కేసులో బిగ్ ట్విస్ట్.. బయటకు వచ్చింది ఆ క్లిప్సే..!

by Bhoopathi Nagaiah |
బాత్ రూంలో సీక్రెట్ కెమెరాల కేసులో బిగ్ ట్విస్ట్.. బయటకు వచ్చింది ఆ క్లిప్సే..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనంగా మారిన హిడెన్ కెమెరాల కేసు కీలక మలుపు తిరిగింది. ఫ్రెండ్స్ మధ్య వచ్చిన మనస్పర్థాలతో మరో వన్ సైడ్ లవర్ సృష్టించిన పుకారే లేడీస్ హాస్టల్ బాత్ రూంలో సీక్రెట్ కెమెరాలు అని కృష్ణా జిల్లా పోలీసులు తేల్చేశారు. ఈ కేసుపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ కావడంలో పోలీసులు అత్యంత పకడ్భందీగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన కృష్ణ, రాము, విష్ణు ఫ్రెండ్స్ (పేర్లు మార్చబడింది). కృష్ణ రాధ ప్రేమించుకుంటున్నారు. అలాగే కృష్ణ, రాము బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో ఒకరి ఇంటికి మరొకరు వచ్చిపోతుండేవారు. ఈ క్రమంలో రాము చెల్లెలు రాధతో కృష్ణ ప్రేమాయణం మొదలు పెట్టారు. మరోవైపు రాధకు తెలియకుండానే విష్ణు ఆమెకు వన్ సైడ్ లవర్‌గా మారాడు. వీరి ప్రేమాయణంలో భాగంగా లవర్స్ ఒకరినొకరు వీడియో కాల్స్ మాట్లాడుకునే వారు. అయితే తన చెల్లితో కృష్ణ లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడని రాముకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఈ క్రమంలో రాధతో మాట్లాడిన వీడియో క్లిప్స్ బయటపెడతానని కృష్ణ బెదిరించాడు. దీంతో మీ చెల్లెలు వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయని కృష్ణ రివర్స్ అయ్యాడు. ఈ పంచాయితీ కాలేజీ సీనియర్స్ దగ్గరకు వెళ్లింది.

ఇదే సమయంలో రాధ తనని కాదని కృష్ణను ప్రేమించిందన్న కోపంతో ఉన్న విష్ణు.. అమ్మాయిల బాత్ రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయని పుకార్లు సృష్టించాడు. దీంతో ఈ వ్యవహారం సీరియస్‌గా మారి రాష్ట్రంలో సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు వెంటనే కాలేజీకి చేరుకుని వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలని ఆదేశించారు. కాగా, ఈ కేసు ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపడుతున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Advertisement

Next Story