- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్
దిశ, వెబ్‌డెస్క్: అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు తిడుతూ కొడాలి నాని వార్తల్లో నిలిచేవారు. కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత కొడాలి నాని టార్గెట్‌గా గుంటూరులో ‘చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ కాళ్ల దగ్గర పడుంటా’ అన్నావ్ కదా అంటూ ఫ్లెక్సీలు వెలసిన విషయం తెలిసిందే. తాజాగా, గుడివాడ వైసీపీ ఆఫీసుపై టీడీపీ ఫ్లెక్సీలు వెలవడం కలకలం రేపింది. శరత్ థియేటర్లో 8 ఏళ్ల క్రితం తాత్కాలిక ఆఫీసును కొడాలి నాని ఏర్పాటు చేశారు. అయితే థియేటర్ ఖాళీ చేయాలని అనేక సార్లు పార్ట్నర్లు రిక్వెస్ట్ చేశారు. అయితే గతంలో భాగస్వాములపై మాజీ మంత్రి కొడాలి నాని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే తాజాగా శుక్రవారం యలవర్తి యువసేన పేరుతో థియేటర్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ఈ థియేటర్లో గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి పార్ట్నర్గా ఉన్నారు. ఇక, ఈ ఘటనపై కొడాలి నాని ఎలా రియాక్ట్ అవుతున్నారన్నది గుడివాడలో హాట్ టాపిక్‌గా మారింది.