చంద్రబాబుకు బిగ్ షాక్: తెలంగాణలో కేసు నమోదు

by Seetharam |   ( Updated:2023-11-02 07:18:01.0  )
చంద్రబాబుకు బిగ్ షాక్: తెలంగాణలో కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే స్కిల్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్,ఐఆర్ఆర్, అంగళ్లు దాడి కేసు, విజయనగరంలో ఇలా అనేక రకాల కేసులు ఎదుర్కొంటున్నారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్‌లో ఉండి ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. మిగిలిన కేసుల్లో కొన్నింటిలో బెయిల్ రాగా మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కోర్టులను చంద్రబాబు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో చంద్రబాబు ర్యాలీపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలై బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి చేరుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఇదే చంద్రబాబు నాయుడు కొంపముంచింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయితే చంద్రబాబు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న తర్వాత నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. దీనిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిచేలా చంద్రబాబు నాయుడు ర్యాలీ నిర్వహించారని బేగంపేట పోలీసులు ఆరోపించారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించడం నిబంధనలను అతిక్రమించడమేనని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులపై బేగంపేట పోలీసులు కేసులు నమోదు చేశారు.

ర్యాలీతో ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఫిర్యాదు

ఇకపోతే అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును చూసేందుకు బేగంపేట విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వివిధ వర్గాల ప్రజలు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును చూసేందుకు ఎయిర్ పోర్ట్‌కు వచ్చారు. కార్లో నుంచే అందరికీ చంద్రబాబు అభివాదం చేశారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. దాదాపు 2 గంటలకు పైగా ర్యాలీగా చంద్రబాబు నాయుడు తన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ర్యాలీపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఎస్ఐ జయచందర్ ఫిర్యాదుతో హైదరాబాద్ సిటీ టీడీపీ జనరల్ సెక్రెటరీ జీవీజీ నాయుడుతో పాటు మరో ఆరుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. IPC సెక్షన్ 341, 290, 341, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ర్యాలీతో ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండుగంటలు రోడ్లపై న్యూసెన్స్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో ఎస్ఐ జయచందర్ పేర్కొన్నారు.



Advertisement

Next Story