బైబిల్ సూక్తి నాకు దిక్సూచి: జనసేనాని పవన్ కల్యాణ్

by Mahesh |   ( Updated:2024-04-03 11:53:56.0  )
బైబిల్ సూక్తి నాకు దిక్సూచి: జనసేనాని పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం.. నియోజకవర్గంలో ఉన్న చారిత్రక బాప్టిస్టు సెంటీవరీ చర్చిని పవన్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ట్విట్టర్ లో జనసేన పార్టీ పేరుతో ప్రత్యేక ట్వీట్ చేశారు. దానికి క్యాస్షన్‌గా బైబిల్ సూక్తి నాకు దిక్సూచి.. సర్వమతాలు, సర్వ ధర్మాల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తానని రాసుకొచ్చారు. అనంతరం అటు నుంచి బషీర్ బీబీ ఔలియా(బంగారు పాపమ్మ) దర్గాకు కాలి నడకన చేరుకున్నారు. అక్కడ పవన్ కల్యాన్ కు దర్గా మత పెద్దలు ఘన స్వాగతం పలికారు.

Read More..

ఎన్నికల ముందు జనసేనకు భారీ షాక్ ఇచ్చిన ఈసీ

Advertisement

Next Story