ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక

by Rajesh |
ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ 16వ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. కాగా, 1983లో అయ్యన్నపాత్రుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. 1983-89, 1994-96 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984-86లో సాంకేతిక విద్యా మంత్రిగా అయ్యన్నపాత్రుడు సేవలందించారు. 1994-96లో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో అనకాపల్లి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999లో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల పాప చేతిలో ఓటమి చెందారు. 2014లో పంచాయతీరాజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో వైసీపీ అభ్యర్థి గణేష్ చేతిలో ఓటమి చెందారు. 2024లో వైసీపీ అభ్యర్థిపై 24వేల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఒక బీసీ నేత సభాధ్యక్ష స్థానంలో కూర్చోవడం సంతోషం అన్నారు. 16వ స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు.

Advertisement

Next Story