- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP:కోర్టు విధులు బహిష్కరించిన ఆత్మకూరు బార్ అసోసియేషన్
దిశ,ఆత్మకూరు:ఆళ్లగడ్డ సీనియర్ న్యాయవాది సుబ్బరామిరెడ్డి పై దాడి చేసిన నంద్యాల రెండో పట్టణ సీఐ రాజారెడ్డిని సస్పెండ్ చేయాలని ఆత్మకూరు బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేముల వెంకటేశ్వర్లు, గొడుగు రవికుమార్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయవాది పై దాడిని నిరసిస్తూ మంగళవారం న్యాయవాదులు ఒక్కరోజు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ కేసు విషయంలో ఆళ్లగడ్డ సీనియర్ న్యాయవాది సుబ్బరామిరెడ్డిని సీఐ రాజారెడ్డి, పోలీసులు పోలీసులు వాహనంలో స్టేషన్‌కు తీసుకెళ్లి ఆయనపై దాడి చేశారని మండిపడ్డారు. న్యాయవాదులకు రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గోవిందరెడ్డి, నూర్ అహ్మద్, పుల్లారెడ్డి, గిరి రాజ్, అబ్దుల్ రబ్, నగేష్, లక్ష్మీనారాయణ, మహబూబ్ బాషా, సిద్ధిక్ అహ్మద్, రహిమాన్, ఆసిఫ్ అలీ ఖాన్, నరసింహులు, హుస్సేన్ మియా, శివశంకర్, గుమాస్తాలు ప్రెసిడెంట్ అంబటి రామచంద్రారెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.