చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

by Seetharam |   ( Updated:2023-10-31 15:23:25.0  )
చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై 50 రోజులు అవుతుందని సిద్ధార్థ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి పరీక్ష నిర్వహించడం, ఆరోగ్య సమస్యలపై దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరాన్ని వైద్యులు చెబుతున్నారని సిద్ధార్థ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను సైతం న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబుకు ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఏఏపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆపరేషన్ ఇప్పటికిప్పుడే అవసరం అని చెప్పలేదని వాదించారు.ఇరువాదనలు విన్న న్యాయమూర్తి వాదనలు ముగిసినట్లు తెలిపారు. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. మరోవైపు మెయిన్ బెయిల్ పిటిషన్ పై రేపు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడించారు.

Also Read..

చంద్రబాబు బయటకొస్తున్న వేళ మరో కీలక పరిణామం.. ఆ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్

Advertisement

Next Story

Most Viewed