Online Shopping: దీపావళికి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నవారికి కేంద్రం వార్నింగ్

by Maddikunta Saikiran |
Online Shopping: దీపావళికి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నవారికి కేంద్రం వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో ప్రస్తుతం దీపావళి పండగ(Diwali Festival) సీజన్ నడుస్తోంది. ప్రతి ఏటా ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్(Online Shopping) చేయడానికి కస్టమర్లు ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి పలు కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. కాగా ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభమైన వెంటనే సైబర్ మోసగాళ్లు(Cyber ​​Fraudsters) కూడా యాక్టివ్‌గా మారతారు. స్కామర్‌లు ఫేక్ వెబ్‌సైట్(Fake Website)ను తెలివిగా డిజైన్ చేసి భారీ డిస్కౌంట్‌లతో ప్రజలను మోసగించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(Ministry of Electronics&IT)ఆద్వర్యంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(CERT-in) సూచించింది. లాటరీ, టెక్ సపోర్ట్, ఇన్వెస్టుమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ, పొరపాటున మనీ పంపడం, పార్సిల్ లాంటి స్కాంలు జరిగే అవకాశముందని కేంద్రం హెచ్చరించింది. తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తే కాలార్ ఎవరో వెరిఫై చేసుకోవాలని, వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని, యాప్స్ ఇన్ స్టాల్ చేయొద్దని, సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేసిన లింక్‌లను క్లిక్ చేయొద్దని సూచించింది.

Advertisement

Next Story