Electricity Department : విద్యుత్ శాఖలో.. కంచె చేను మేసింది..

by Sumithra |   ( Updated:2024-10-27 04:05:33.0  )
Electricity Department : విద్యుత్ శాఖలో.. కంచె చేను మేసింది..
X

దిశ, ఆలేరు : వ్యవసాయ బోరు బావులు, పంపు, మోటార్ల విద్యుత్ కోసం ఏర్పాటు చేసిన 100కేవీ, 63 కేవీ, డీటీఆర్ లపై అదనపు లోడు భారం తగ్గించేందుకు, అలాగే రైతుల వ్యవసాయ బోరు, బావి మోటర్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు రైతు సంక్షేమం కోసం లక్షలాది రూపాయలను సబ్సిడీగా వెచ్చించి 25 కేవీ డీటీఆర్ ( డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ) (Distribution Transformer) లను రైతులకు సబ్సిడీ రూపంలో మంజూరు చేస్తుంది. ప్రభుత్వ ఉద్దేశం నూటికి నూరు శాతం మంచిదే అయినప్పటికీ అవసరం లేకున్నా ఆ ప్రాంతంలో అధిక విద్యుత్ లోడు లేకున్నప్పటికీ విద్యుత్ శాఖలోని కొంతమంది అధికారులు అదనపు 25 కేవి డీటీఆర్ బిగిస్తున్నారు. దీంతో ఒక్కొక్క డీటీఆర్ ల ఏర్పాటు కోసం రైతుల నుంచి రూ.50 నుంచి 60 వేల వరకు విద్యుత్ అధికారులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కేవలం రూ.50 వేల నుంచి రూపాయల 60 వేల రూపాయల కోసం సంస్థకు లక్షల్లో నష్టం చేస్తూ, సంస్థ మరింత నష్టాల్లోకి పోవడానికి అధికారులు పరోక్షంగా కారణం అవుతున్న అధికారుల తీరు విద్యుత్ శాఖలోని డీటీఆర్ ల ఏర్పాటు పై "కంచె చేను మేసింది" అన్న చందంగా మారింది. విద్యుత్ శాఖ ( Electricity Department ) అధికారులు తీరు. దీని పై దిశ పరిశోధనాత్మకమైన ప్రత్యేక కథనం.

అవసరం లేకున్నా డీటీఆర్ ల ఏర్పాటు..

వ్యవసాయ భూమి పంట పొలాల్లోని బోరుబావులకు సరఫరా అయ్యే విద్యుత్తులో అధిక లోడు ఉంటేనే 25 కేవీ డీటీఆర్ లు బిగించాలి. వీటిని కూడా వ్యవసాయ పంట పొలాల్లోని వ్యవసాయ భూముల ప్రాంతంలో మాత్రమే బిగించాలి. ఇదే విషయం పై సంబంధిత లైన్ ఇస్పెక్టర్లు, లైన్మెన్లు సిబ్బంది క్షేత్రపరిశీలన చేసి వారి ఇచ్చిన నివేదిక ఆధారంగానే తదుపరి ఉన్నతాధికారులు ఎస్టిమేషన్ వేసి బిగించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలి. కాని వాస్తవానికి పంట పొలాల్లోని వ్యవసాయ భూముల్లో వున్నా బోరు బావులకు అధిక లోడు లేనప్పటికీ విద్యుత్ శాఖ సిబ్బంది ఎలాంటి క్షేత్ర పరిశీలన లేకున్నప్పటికీ. అధికారులు అడ్డగోలుగా ఎస్టిమేషన్ రూపొందించి. ఒక్కొక్క డీటీఆర్ పై రూ.50 వేల నుంచి. 60 వేల వరకు వసూళ్లు చేస్తు డీటీఆర్ ( DTR ) బిగిస్తున్నట్లు సమాచారం. వసూళ్లు చేసిన మొత్తాన్ని"తిలాపాపం తలా పిడికెడు"అన్న చందంగా అధికారులు వాటాలుగా పంచుకుంటున్నట్లు సమాచారం ? అదే విధంగా ప్రభుత్వం లక్షలాది రూపాయల సబ్సిడీ పై అందించే 25 కేవీ డీటీఆర్ లు పండ్ల తోటలకు కమర్షియల్ భూములుగా మారిన రియల్ ఎస్టేట్ బడా సంస్థలకు సైతం డీటీఆర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తిన్నాయి.

ఒక్కొక్క డీటీఆర్ ఏర్పాటు పై రూ.3 నుంచి 4 లక్షల భారం !

ఒక్కొక్క డీటీఆర్ పై ఏర్పాటు పై (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్,) పరికరాలు, పొల్లు, విద్యుత్ వైర్లు, లేబర్, వీటన్నిటితో కలిపితే ఒక్కొక్క డీటీఆర్ ఏర్పాటు పై సంస్థకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు భారం పడుతుంది.

దిశ పరిశీలనలో వెలుగులోకి....

డీటీఆర్ ల ఏర్పాటు పై దిశ లోతుగా పరిశీలన చేసింది. దీంతో అధికారుల అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మోటకొండూరు మండలం దిలావర్ పూర్ గ్రామ రెవెన్యూ శివారులో గల ఒక బడా రియల్ వ్యాపారికి చెందిన భూమిలో ఎలాంటి వాడుకలో బోరు మోటర్లకు కనెక్షన్లు బిగించకుండానే ప్రస్తుతం డీటీఆర్ తో ఎలాంటి అవసరం లేకున్నాపటికి 25 కేవీ డీటీఆర్ ను అధికారులు బిగించారు. ఇది బిగించి సుమారు 6 సంవత్సరాలు క్రితం విద్యుత్ శాఖ అధికారులు బిగించినట్లు తెలిసింది. నాటి నుంచి నేటి వరకు ఆ డీటీఆర్ ఎలాంటి వాడుకంలో లేదనే వాస్తవాలు వెలుగులో కి వచ్చాయి. ఇదేవిధంగా అవసరం లేనప్పటికీ ఆలేరు మండలం కొలనుపాక, పటేల్ గూడెం, గొలనుకొండ. ఆలేరులో డీటీఆర్ లు ఏర్పాటు చేసినట్టు సమాచారం. డివిజన్ విద్యుత్ ( ఆపరేషన్) భువనగిరి కార్యాలయం పరిధిలోని మండలంలోని గ్రామాల్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భువనగిరి జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

విచారణ చేస్తాం: రాజశేఖర్ ఏడీఈ ఆలేరు..

అవసరం లేకున్నప్పటికీ బిగించిన డీటీఆర్ ల పై క్షేత్రస్థాయిలో విచారణ చేసి అవసరం ఉన్న చోట బిగించి. సంస్థకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాము.

Advertisement

Next Story

Most Viewed