దీపావళి సందర్భంగా అధికంగా కాల్చనున్న బాణాసంచా.. వాయు కాలుష్యంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

by Anjali |   ( Updated:2024-10-27 10:13:29.0  )
దీపావళి సందర్భంగా అధికంగా కాల్చనున్న బాణాసంచా.. వాయు కాలుష్యంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
X

దిశ, వెబ్‌డెస్క్: దీపాల పండుగ దీపావళి(Diwali) సమీపిస్తోంది. తెలుగు వారు ఎంతో ప్రతిష్టంగా జరుపుకునే ఈ పండుగను మెరిసే దీపకాంతులతో వెలుగులతో సెలబ్రేట్ చేసుకుంటారు. దీపావళి పండుగ తెలుగు ప్రజలకు సంతోషాన్ని ఇస్తుంది. ఐక్యతా(unity) అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఎంతో మంది బాణాసంచా(fireworks) కాల్చుతారు. దీంతో వాయు కాలుష్యం ఏర్పడుతుంది. వాయు కాలుష్య(air pollution) స్థాయి కూడా అధికంగా పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యానికి ముప్పు వస్తుంది. కాగా కాలుష్యాన్ని నివారించడానికి ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.

దీపావళి పండుగకు వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లోని కిటికీలు(windows) అండ్ డోర్స్ క్లోజ్ చేసి ఉంచాలి. దీంతో బయటి కాలుష్యం ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫై(Air purifier)యర్ వాడండి. ఇంటి లోపల గాలి నాణ్యతను నిర్వహించడానికి ఎయిర్ ప్యూరిఫైయర్ బాగా ఉపయోగపడుతుంది. దీపావళి సందర్భంగా ఎక్కువ స్థాయిలో కాలుష్యం ఉంటుంది కాబట్టి శ్వాస సమస్యలు(Breathing problems) తలెత్తే అవకాశం ఉంటుంది.

దీంతో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్(Hydrated) గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే. కాగా వాటర్ ఎక్కువగా తాగాలి. దీంతో శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. శ్వాస సమస్యలు రావు. వాటర్ అధికంగా తీసుకుంటే బాడీ కూడా హైడ్రేట్ గా ఉంటుంది. దీపావళి నాడు మీ ఇమ్యూనిటి పవర్(Immunity power) పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అల్లం, తేనె, పసుపు, సిట్రస్ పండ్లు(Citrus fruits) తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants)పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంలో మేలు చేస్తాయి.

Advertisement

Next Story