నాలుగు నెలల క్రితం మహిళను చంపిన జిమ్ ట్రైనర్.. డెడ్ బాడీ ఎలా దొరికిందంటే..

by Rani Yarlagadda |
నాలుగు నెలల క్రితం మహిళను చంపిన జిమ్ ట్రైనర్.. డెడ్ బాడీ ఎలా దొరికిందంటే..
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగు నెలల క్రితం జిమ్ ట్రైనర్.. ఓ వ్యాపారి భార్యను చంపి.. నిత్యం పోలీసులు, ప్రభుత్వ అధికారులు తిరిగే మేజిస్ట్రేట్ బంగ్లాకు అతి సమీపంలో పాతిపెట్టాడు. మిస్సైన మహిళ హత్యకు గురైందని నిర్థారించిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా.. షాకింగ్ విషయాలు వెల్లడించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు విమల్ సోన్.. గ్రీన్ పార్క్ ప్రాంతంలో జిమ్ ట్రైనర్ (GYM Trainer)గా పనిచేస్తున్నాడు. తను ట్రైన్ చేస్తున్న మహిళకు అతనికి మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమెకు అప్పటికే పెళ్లైంది. భర్త వ్యాపారవేత్త.

అనూహ్యంగా జూన్ 24 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. 20 రోజుల తర్వాత జిమ్ కు వచ్చిన మహిళ.. విమల్ తో కలిసి కారులో బయటికి వెళ్లింది. అతను మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడని తెలిసి.. కోపంతో రగిలిపోయింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో విమల్ ఆమెను మెడపై బలంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం హత్య చేసి, మృతదేహాన్ని.. కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ బంగ్లా (Kanpur District Magistrate's bungalow)కు సమీపంలో పాతిపెట్టాడు. కాన్పూర్‌లోని రాయ్‌పూర్వా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ ప్రాంతాన్ని తవ్వుతుండగా.. మహిళ మృతదేహం లభ్యమైంది. కాగా.. హత్య తర్వాత నిందితుడు తన మొబైల్ ను వాడకపోవడంతో.. అతడిని గుర్తించడం కష్టమైందని నార్త్ కాన్పూర్ డీసీపీ శ్రవణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. అయితే ఆమె వేసుకున్న ఆభరణాలను అతను దొంగిలించాడా అన్న విషయం తెలియాల్సి ఉందని, ఇంకా విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed