- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోయిన్‌తో రాఖీ కట్టించుకున్న Venkatesh.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే
దిశ, సినిమా: దగ్గుబాటి రామానాయుడు(Daggubati Ramanaidu) తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కలియుగ పాండవులు’(Kaliyuga Pandavulu) సినిమాతో హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసి నేడు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తమ ఫ్యామిలీలో ఒకరిగా మన్ననలు పొందారు హీరో వెంకటేష్. అయితే ఈయన సినిమాల్లోకి రాకముందే నీరజని పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సినిమాల్లోకి వచ్చాక వెంకటేష్ మరో హీరోయిన్ని పెళ్లాడాలి అనుకున్నారట. తన భార్యకు విడాకులు ఇచ్చి వెంకటేష్ మరో వివాహం చేసుకుంటున్నారని ఇండస్ట్రీ మొత్తం అప్పట్లో గుసగుసలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదండోయ్.. తన అందం, అభినయంతో ఎంతో మంది మనసులో చెరగని ముద్ర వేసుకున్న దివంగత హీరోయిన్ సౌందర్య(Soundarya).
వెంకటేష్ సౌందర్య కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. కాగా ఆ సినిమాలన్నీ హిట్ అవడం విశేషం. అయితే వీరి కాంబోలో ఎక్కువ సినిమాలు రావడమే కాదు ఆన్ స్క్రీన్ పై హిట్ పెయిర్ వీరికి ఎంతో మంచి గుర్తింపు ఉంది. దీంతో వెంకటేష్, సౌందర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే సౌందర్యతో వెంకటేష్ సాన్నిహిత్యంగా ఉండటం చూసిన రామానాయుడు కూడా వెంకటేష్‌ని చాలాసార్లు మందలించారట. ఇక వెంకీ భార్య నీరజ(Neeraja) కూడా ఎక్కడ సౌందర్య మాయలో పడిపోతాడో అని బాధపడి రామానాయుడికి చెప్పడంతో రామానాయుడు ఓ రోజు సౌందర్య ఇంటికి నేరుగా వెళ్లి అసలు విషయం చెప్పాడట. కానీ సౌందర్య మాత్రం మీరు అనుకుంటున్నట్లు మీడియాలో వస్తున్నట్లు వెంకీకి నాకు మధ్య ఎలాంటి బంధం లేదు. కేవలం సినిమాల వరకే మేమిద్దరం కెమిస్ట్రీ కోసం అలా ఉంటాం. కానీ తెర వెనుక మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని క్లారిటీ ఇచ్చింది.
కానీ బయట అందరి నోరులు మూయించాలంటే నువ్వు ఒక పని చేయాలి అని రామానాయుడు చెప్పారట. దానికి ఓకే చెప్పిన సౌందర్య నువ్వు నా కొడుకుకి రాఖీ కట్టాలి అని చెప్పడంతో సౌందర్య మనసులో వెంకటేష్ పై ఎలాంటి దురుద్దేశం లేకపోవడంతో వెంటనే వెళ్లి వెంకటేష్‌కి రాఖీ కట్టిందట. అయితే ఈ విషయం అప్పట్లో టాలీవుడ్లో పెద్ద సెన్సేషన్ అయినప్పటికీ ఈ విషయంపై ఎక్కువ రచ్చ చేయలేదు. దీంతో ఇది రూమర్ గానే మిగిలిపోయింది. ఇక ఈ విషయం తెలిసిన టాలీవుడ్ జనాలు మాత్రం పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయితో రాఖీ కట్టించుకున్న వెంకటేష్ అంటూ మాట్లాడుకున్నారు. అయితే ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More : త్వరలో వెంకీ-అనిల్ రావిపూడి సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ ?