- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్తీక చివరి సోమవారం.. మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
దిశ, శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక మాసం చివరి సోమవారం పైగా శ్రీ మల్లికార్జున స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది భక్తులు వేకువజామునుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,క్షేత్రంలో పలుచోట్ల భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పాలు ప్రసాదాలు అందచేస్తున్నారు. రద్దీ దృష్ట్యా ముందస్తుగా ఇప్పటికే శని, అది, సోమవారాలలో స్పర్శ దర్శనం, సామూహిక, గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేశారు నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు సాయంత్రం కార్తీక చివరి సోమవారం పురస్కరించుకుని సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.