Sambhal Protest: సంభల్‌ అల్లర్లు.. ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

by Rani Yarlagadda |
Sambhal Protest: సంభల్‌ అల్లర్లు.. ఇంటర్నెట్‌ సేవలు బంద్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని సంభల్ లో ఆదివారం జరిగిన అల్లర్లలో నలుగురు మరణించిన విషయం తెలిసిందే. 20 మంది పోలీస్ అధికారులు సహా.. పలువురు గాయపడ్డారు. మసీదు సర్వేను వ్యతిరేకిస్తూ జరిగిన అల్లర్లను ఆపేందుకు అధికారులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. 24 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూల్స్, కాలేజీలను మూసివేశారు. మొఘలులు ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారనే ఫిర్యాదుపై స్పందించిన కోర్టు ఆదేశాల మేరకు ఈ సర్వే జరిగింది. బహిరంగ సభలను నిషేధిస్తూ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. రాళ్లు, సోడా సీసాలు, పేలుడు పదార్థాలను కొనుగోలు చేయకుండా ఆదేశాలు జారీ చేసింది.

సంభాల్‌లోని షాహీ మసీదును మొఘల్ కాలంలో గతంలో ఆ స్థలంలో ఉన్న ఆలయాన్ని కూల్చివేసి నిర్మించారని ఆరోపించిన ఫిర్యాదు మేరకు నిరసనకారులు అడ్వకేట్ కమిషన్ సర్వేను వ్యతిరేకించడంతో హింస చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లదాడికి దిగారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌తో స్పందించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆందోళన గంటల తరబడి కొనసాగింది.

దుండగులు కాల్పులు జరిపారని, ఒక పోలీసు అధికారి కాలికి తుపాకీ గుండు తగిలిందని పోలీసులు తెలిపారు. మరో అధికారికి పెల్లెట్‌లు తగిలాయి. ఈ హింసలో 15 నుండి 20 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరో పోలీసు తలకు బలమైన గాయం కాగా.. డిప్యూటీ కలెక్టర్ కాలు విరిగింది. ఈ అల్లర్లలో మరణించిన వారిని నౌమాన్, బిలాల్, నయీమ్, మహ్మద్ కైఫ్‌లుగా గుర్తించారు. బాధితులకు బుల్లెట్ గాయాలు తగిలినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. శవపరీక్ష తర్వాతే మృతికి గల కారణాలను నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story