BRS: నేడు బీఆర్ఎస్ మహాధర్నా.. మహబూబాబాద్ లో ఫ్లెక్సీల రగడ

by Ramesh Goud |
BRS: నేడు బీఆర్ఎస్ మహాధర్నా.. మహబూబాబాద్ లో ఫ్లెక్సీల రగడ
X

దిశ, వెబ్ డెస్క్: మహబూబాబాద్‌(Mahaboobabad)లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మహాధర్నా(Mahadharna)కు పిలుపునిచ్చిన వేళ జిల్లాలో ఫ్లెక్సీ(Flexis)ల రగడ జరుగుతోంది. లగచర్ల ఘటన(Lagacharla Incident)తో పాటు రాష్ట్రంలో గిరిజనులు, దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పాల్గొననున్నారు.

అయితే కేటీఆర్ మహబూబాబాద్ పర్యటనపై గత రెండు రోజులుగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహాధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో చించేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేటీఆర్ ఫ్లెక్సీని చించేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వాదులు(BRS Supporters) కోరుతున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ మహాధర్నా నేపథ్యంలో జిల్లాలో అవాంచిత ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీసులు సంసిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story