- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లోయలో పడిన బస్సు.. 17 మంది మృతి
దిశ, వెబ్ డెస్క్: సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. లోయలో పడటంతో 17 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం బ్రెజిల్ (Brazil)లోని ఈశాన్య అలగోస్ రాష్ట్రంలో జరిగింది. ఆదివారం.. ఓ మారుమూల పర్వత రహదారిపై యూనియావో డాస్ పాల్మరెస్ పట్టణానికి సమీపంలో ఉన్న చారిత్రక ప్రదేశానికి తీసుకువెళుతుండగా 65 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ బస్సుపై పట్టు కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ ప్రమాదంపై బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, వారికి కావలసిన సహాయం, సంరక్షణ ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు.