IAS అవ్వబోయి హీరోయిన్ అయిన సాయి ధరమ్ తేజ్ బ్యూటీ.. దానికి కారణం అదే అంటూ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
IAS అవ్వబోయి హీరోయిన్ అయిన సాయి ధరమ్ తేజ్ బ్యూటీ.. దానికి కారణం అదే అంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఊహలు గుసగుసలాడే(Oohalu Gusagusalade) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాశి ఖన్నా(Rashi Khanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మంచి స్టార్‌డమ్ తెచ్చుకుంది. తాజాగా తమన్నా(Tamanna), రాశిఖన్నాలు కలిసి ‘అరుణ్మణై 4’(Arunmanai 4) అనే మూవీలో నటించి మెప్పించారు. ఈ సినిమా ఎంతగా హిట్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ABP నెట్‌వర్క్ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఇందులో రాశీ మాట్లాడుతూ.. “నా జీవితంలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. నేను విధిని నమ్ముతాను, నేను కోరుకున్నది ఏదీ ఇప్పటి వరకు నాకు దక్కలేదు. నిజానికి నేను IAS ఆఫీసర్ అవ్వాలని కోరుకున్నాను. కానీ అది జరగలేదు. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో పెరిగే వారు ఒక మంచి సేఫ్టీ ఉద్యోగం కావాలని అనుకుంటారు. నేను కూడా అలానే IAS అయితే రక్షణగా ఉంటుంది కచ్చితంగా చేయాలి అనుకున్నా, సబ్జెట్‌లో కూడా నేను టాపర్. కానీ నేను ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకున్నాడు. ఆయన అనుకున్న దాని ప్రకారమే నేను ఇప్పుడు నటి అయ్యాను అంటూ రాశిఖన్నా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story