నువ్వు రాజకీయ విటుడివా..లేక రాజకీయ బ్రోకరువా?: పవన్ కల్యణ్‌పై మంత్రి అంబటి ఫైర్

by Seetharam |
నువ్వు రాజకీయ విటుడివా..లేక రాజకీయ బ్రోకరువా?: పవన్ కల్యణ్‌పై మంత్రి అంబటి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘నువ్వు రాజకీయ విటుడివా... లేక రాజకీయ బ్రోకరువా!’ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి మండిపడ్డారు.‘పదేళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నావు... నువ్వు రాజకీయ నాయకుడివా, లేక రాజకీయ నటుడివా... లేకపోతే రాజకీయ విటుడివా... లేక రాజకీయ బ్రోకరువా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.‘అసలు నీ వ్యక్తిత్వం ఏంటి? నీ వ్యవహారం ఏంటి? ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి? తెలంగాణలో నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావ్? చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు? అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ, బీఆర్ఎస్ సవాల్ చేస్తుంటే నీ జెండా ఎక్కడ కట్టావ్... బీజేపీ పక్కన కట్టావ్. మరి చంద్రబాబు జెండా ఎక్కడ కట్టాడు... కాంగ్రెస్ పక్కన కట్టాడు. ఏం బతుకులయ్యా మీవి? చంద్రబాబేమో ఇంట్లో కూర్చుంటాడు... కాంగ్రెస్ మీటింగులు జరుగుతుంటే వాటిల్లో పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి. బీజేపీలో ఏమో నువ్వు డైరెక్టుగా వెళ్లి జెండాలు కట్టి కూర్చున్నావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీకి సెకండ్ సెటప్పువా?

తెలంగాణలో ఒక నాటకం ఏపీలో మరో నాటకం మీ బతుకులేంటి అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. రాష్ట్రంలో నీచయైన రాజకీయాలు చేసేది చంద్రబాబే అనుకుంటే పవన్ కల్యాణ్ ఆయనను మించిపోయారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీతో.. ఏపీలో టీడీపీతో పొత్తు ఏంటని నిలదీశారు. నువ్వు బీజేపీకి సెకండ్ సెటప్పువా... లేక ఇక్కడ టీడీపీకి సెకండ్ సెటప్పువా! అసలు నీ బ్రతుకేంటి? అని అంబటి రాంబాబు నిలదీశారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తన రాజకీయ సిద్ధాంతాలపై నోరు విప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణలో ఒక డ్యాన్సు చేస్తావు, ఏపీలో మరో డ్యాన్సు చేస్తావు. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేయడానికి ఇవి సినిమాలు కావు... రాజకీయాలు అంటూ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ కేవలం డబ్బు తీసుకుని పనిచేసే వ్యక్తిగానే తయారవుతున్నావు. అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను... ఆయన పీకే కాదు కేకే అని. కేకే అంటే కిరాయి కోటిగాడు. ఎవరో అన్నారు కిరాయి కోటిగాడు బాగా లేదండీ... కిరాయి కల్యాణ్ అనండి... బాగా సూటవుతుంది అన్నారు. నువ్వు నిజంగా కిరాయి కల్యాణ్ వే. రౌడీలు కిరాయి తీసుకుని హత్యలు చేస్తుంటారు... నువ్వు కిరాయి తీసుకుని రాజకీయ హత్యలు చేసేందుకు ప్రయత్నించే వ్యక్తివి అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story