AP News:కోట్ల విలువైన ప్రభుత్వ భూములు స్వాహా..భారీ స్థాయిలో వైసీపీ నాయకుల భూదందా..?

by Jakkula Mamatha |
AP News:కోట్ల విలువైన ప్రభుత్వ భూములు స్వాహా..భారీ స్థాయిలో వైసీపీ నాయకుల భూదందా..?
X

దిశ,నందికొట్కూరు:గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుల భూదందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారులను బెదిరించి పేదలు, మాజీ సైనికుల పేరుతో ప్రభుత్వ భూములు కొట్టేశారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమార్కుల రాజకీయ పలుకుబడితో ఆక్రమణల వైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. నందికొట్కూరు మండలం అల్లూరు , మల్యాల గ్రామ సమీపంలో సర్వేనెంబర్ 134, 172 లో దాదాపు 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నాయకుల కన్ను ఈ గుట్టలపై పడింది. గుట్టలను చదును చేసేసి అక్రమాలకు తెర తీశారు.బినామీ పేర్లతో ఆక్రమించుకున్నట్లు సమాచారం. 136 ఎకరాల 25 సెంట్లు ఆక్రమణలకు గురైనట్లు సమాచారం. ఇందులో మల్యాల గ్రామానికి చెందినవారు మాత్రమే కాకుండా నందికొట్కూరు మండలంలోని శాతనకోట, అల్లూరు, నందికొట్కూరు,గ్రామాలకు చెందిన ఎస్సి, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన రైతుల బినామీ పేర్లతో రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని పాసు పుస్తకాలు సైతం సృష్టించుకున్నట్లు పలువురు ప్రజాసంఘాల నాయకులు,పేద మధ్యతరగతి ప్రజలు ఆరోపిస్తున్నారు.

అల్లూరు గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు మాజీ సైనికుల పేరు చెప్పి గ్రామస్తులకు మస్కా కొట్టి దాదాపు 10 ఎకరాలు కబ్జా చేసినట్లు సమాచారం. ఇందులో అతని పేరు పై రెండు ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకం గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్ మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి . అయితే ఈ భూములు ఇప్పటికే అక్రమార్కుల పేరుతో ఆన్ లైన్‌లో నమోదు కావడం విశేషం.సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కొందరివి మాత్రమే ఆన్ లైన్ అడంగల్‌లో ఎక్కడం లేదని సమాచారం. అక్రమార్కులు పొలంలో సాగు చేసుకుంటున్న ప్రశ్నించే వారిలేరు.టీడీపీ ప్రభుత్వం లోనైన వైసీపీ నాయకులు భూ దందా పై విచారణ జరిపి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

Advertisement

Next Story