APSRTC: ఆర్టీసీ బస్సు బీభత్సం.. పంట కాలువలోకి దూసుకెళ్ళిన బస్సు

by Ramesh Goud |   ( Updated:2024-11-04 12:38:14.0  )
APSRTC: ఆర్టీసీ బస్సు బీభత్సం.. పంట కాలువలోకి దూసుకెళ్ళిన బస్సు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తూర్పు గోదావరి(East Godavari) జిల్లాలో ఆర్టీసీ బస్సు(RTC Bus) అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. అనపర్తి(Anaparthi) మండలం పులగుర్తలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రయాణికులతో వెళుతున్న సమయంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లి, బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరు మృతి చెందలేదు. స్థానికులు క్షతగాత్రులను రామచంద్రాపురం(Rama Chandrapuram) ప్రభుత్వ ఆసుపత్రి(Govt Hospital)కి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వేగమే ప్రమాదానికి కారణమా? మరేదైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనంతరం క్రేన్ సహాయంతో బస్సును బయటకి తీశారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed