- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్‌లోకి మరో కొత్త జట్టు.. అమరావతి పేరుతో ప్రమోట్ చేస్తామంటున్న మంత్రి
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ దేశాల్లో ఐపీఎల్ కు ఉన్నంత క్రేజ్ మరో టోర్నీకి ఉండదు. అంతటి భారీ టోర్నమెంట్ లో కేవలం 10 జట్లు మాత్రమే ఉన్నాయి. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలకు కలిపి ఒకటే జట్టు ఉంది. ఈ క్రమంలోనే చాలా రోజులుగా ఐపీఎల్ జట్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదు సంవత్సరాలలో అమరావతి పేరుతో ఏపీ టీమ్ ను ప్రమోట్ చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే గత ప్రభుత్వం క్రీడలను పట్టించుకోలేదని.. తాము ఏపీ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. దీని కోసం విద్యాసంస్థల్లో ప్రతి రోజు గంటపాటు క్రీడలకు కేటాయించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని.. పిల్లలకు అనువుగా మైదానాలు లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.