ఆస్పత్రిలో తమ్మినేని.. బెడ్‌పై నుంచే కీలక వీడియో విడుదల

by srinivas |   ( Updated:2024-01-06 13:27:45.0  )
ఆస్పత్రిలో తమ్మినేని.. బెడ్‌పై నుంచే కీలక వీడియో విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. నీరసంగా ఉండటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ మెడికోవర్ ఆస్పత్రిలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. అయితే ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ప్రస్తుతం మెరుగైన వైద్యం అందిస్తున్నారని, టెస్టుల అనంతరం తదుపరి వైద్యంపై డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. తనకు ఏ వ్యాధి సోకిందని, జబ్బు వచ్చిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు. తనకు ఏ వ్యాధి సోకలేదని, ఆరోగ్యంగానే ఉన్నానని తమ్మినేని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ప్రతినిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో తనకు డీ హైడ్రేషన్ అయిందని, వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. సోమవారం నుంచి యధావిథిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. అయితే ఈ రెండు రోజుల్లో పరామర్శల పేరుతో తన వద్దకు ఎవరూ రావొద్దని సూచించారు. ఎవరు ఎంత ప్రచారం చేసినా ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడం తన బాధ్యత అని తమ్మినేని సీతారం పేర్కొన్నారు.

Advertisement

Next Story